చెన్నై: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరానికి చేందిన 38 మంది జాలర్లను గురువారం శ్రీలంక నావికాదళం అరెస్టు చేసి తమ దేశానికి తీసుకెళ్లింది. మూడు రోజుల క్రితం ఈ తరహా దాడులకు ఓ పరిష్కారం కనుగొనేందుకు ఇరు దేశాల జాలర్ల సంఘాల మధ్య చెన్నైలో ఉన్నత స్థాయి చర్చలు జరిగిన విషయం తెలిసిందే దీనికి సంబంధించి విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ ఈ దేశ ఉన్నతాధికారులతో ఫోన్‌ల్లో గురువారం సుధీర్ఘచర్చలు జరిపారు. ఇవి ముగిశాయో లేదో తాజాగా మళ్లీ జాలర్లు అరెస్టు కావటంపై ఇక్కడి సంఘాలు, అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అ ంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చిన జాలర్లను వెనక్కు వెళ్లిపో వాల్సిందిగా సూచించినప్పటికి పట్టింకోలేదని శ్రీలంక అధికార వర్గాలు తెలిపాయని రామేశ్వరంలో మత్య్సశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ 38మంది జాలర్లు వెనక్కు వెళ్లిపోవాల్సిందిగా సూచించినప్పటికీ పట్టించుకోలేదని శ్రీలంక అధికారవర్గాలు తెలిపాయని రామేశ్వరంలో మత్య్సశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ 38 మంది జాలర్లు నీటి కలుషితం చేసే నిషేధిత వలలను వినియోగించటం కూడా మరో కారణమని చెన్నైలో జరిగిర చర్చల్లో చేసిన సూచనలను పట్టించుకోకపోవటంతో అరెస్టు చేశామని తెలిపారు.




