ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేస్తున్న దీక్ష నాల్గవ రోజుకు చేరింది. శరీరంలో చెక్కర నిల్వలు పడిపోతూ ఆరోగ్యం విషమంగా పరిణమిస్తుండటంతో దీక్ష విరమించాల్సిందిగా సహచరు నేతలు కోరుతున్నారు. అయినా కిషన్‌రెడ్డి పట్టువడవకుండా దీక్షను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్‌లో బిల్లు పాసయ్యేంతవరకు దీక్షను విరమించేది లేదని చెబుతూ ఏపీభవన్‌లో తాను ఈ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.




