రామనాథపురం : భారత సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన 14 మంది శ్రీలంక మత్స్యకారులకు పారముడికి కోర్టు జూన్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బుధవారం హిందూ మహాసముద్రంలోని భారత జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన శ్రీలంకకు చెందిన 14 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డు అధికారులు అరెస్ట్ చేసి, వారి నుండి మూడు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా గురువారం వీరిని పారముడికి కోర్టులో హాజరుపర్చారు. కేసు విచారించిన కోర్టు వీరికి జూన్ 4 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఈ సంవత్సరం మొత్తంలో భారత జలాల్లోకి ప్రవేశించిన 64 మంది శ్రీలంకకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేశారు.
Related