న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని నగరం గ్రామంలో పైపులైను పేలుడు ఘటనలో మృతిచెందిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు కేంద్రం రూ.4 కోట్ల నష్ట పరిహారాన్ని ప్రకటించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన గెయిల్ (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) అధికారులు నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. పేలుడు ఘటనతో తీవ్ర స్థాయిలో దెబ్బతిన్న నగరం గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ధే బాధ్యత తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, గాయపడిన 19 మందికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారాన్ని గెయిల్ ప్రకటించిన విషయం తెలిసిందే.




