డిసెంబర్ 4న కేంద్రానికి టీ నివేదిక
జాప్యమొద్దని మేడం హుకుం
నేడు కోర్‌కమిటీ కీలక సమావేశం
వెనువెంటనే రాష్ట్రపతికి, అసెంబ్లీకి
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ
న్యూఢిల్లీ, నవంబర్ 28 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై మంత్రుల బృందం సిద్ధం చేసిన నివేదిక డిసెంబర్ 4న కేంద్ర కేబినెట్‌కు సమర్పిస్తామని హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. బుధవారం సుదీర్ఘంగా చర్చించిన మంత్రుల బృందం గురువారం కూడా మరోమారు సమావేశమై పలు అంశాలను చర్చించింది. నార్త్ బ్లాక్‌లోని చిదంబరం కార్యాలయంలో జీవోఎం భేటీ ముగిసింది. అనంతరం చిదంబరం, జైరాం రమేశ్‌లు ఆర్థికశాక అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనేక చేర్పులు, మార్పుల అనంతరం ఎట్టకేలకు ఆంధప్రదేశ్ విభజనపై జీవోఎం తుది నివేదికను ఖరారు చేసింది. ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడుతూ బిల్లు రూపకల్పనలో ఎలాంటి లోపాలు లేకుండా నిశితంగా పరిశీలించినట్లు చెప్పారు. బిల్లుపై పలు దఫాలుగా నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులురాకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ నివేదికను మంత్రుల బృందం డిసెంబరు 4న కేంద్రానికి సమర్పించనున్నట్లు సమాచారం. అదేరోజు జీవోఎం నివేదికపై కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇదిలావుంటే కాంగ్రెస్ కోర్‌కమిటీ శుక్రవారం భూటీ కానుంది. ఆంధప్రదేశ్ విభజనపై మంత్రుల బృందం నివేదికను ఖరారు చేయడంతో ఈ నివేదికపై కోర్‌కమిటీలో చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో కేంద్ర వివత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ మర్రి శశిధర్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలనే అంశంపై వారు చర్చించినట్టు సమాచారం. ఇదిలావుంటే డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి బయలుదేరారు. మొత్తంగా శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టే దిశగా తెలంగాణ ఏర్పాటు పక్రియ చురకుగా సాగిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన సిఫారసులు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర విభజనపై నెలకొల్పిన మంత్రుల బృందం తన కసరత్తును ముగించింది. రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన పద్ధతులపై జీవోఎం నివేదిక తయారు చేయటం దాదాపు పూర్తయిందని ¬ంశాఖ వర్గాలు చెబుతున్నాయి.చిన్న చిన్న మార్పులు ఉంటే చూసి.. దానికి తుదిరూపం ఇచ్చి కేబినెట్‌కు సమర్పించే బాధ్యతను ¬ం మంత్రి షిండేకు అప్పగిస్తూ జీవోఎం ఏకక్షిగీవంగా నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి ముందు న్యాయపరమైన చిక్కులేవిూ లేవని నిర్థారించుకునేందుకు మరోసారి న్యాయశాఖకు నివేదికను పంపుతారని సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే న్యాయశాఖ తెలంగాణ ఏర్పాటు బిల్లు కేబినెట్‌కు అందిస్తుంది. ఇప్పటికే బిల్లును న్యాయశాఖ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, ఆర్టికల్ 371 డీ, భద్రాచలం వంటి అంశాలను బిల్లులో చేర్చుతూ న్యాయశాఖ తుది ముసాయిదాను తయారు చేయడం లాంఛనంగానే కనిపిస్తున్నది. కేబినెట్ ఆమోదించే ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి, అక్కడి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లి వస్తుంది. డిసెంబర్ మొదటివారంలోనే బిల్లు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే వీలుందని అంటున్నారు. బిల్లు విధి విధానాలు పూర్తయ్యాయి కనుక జీవోఎం సిఫారసులను సిద్ధం చేసి షిండేకు అప్పగించామని, కేబినెట్ ముందుకు ఆ నివేదికను తీసుకెళ్లే బాధ్యత ఆయనదే అని తెలుస్తోంది. జీవోఎం తాను నిర్దేశించుకున్న 11 అంశాలకు సంబంధించి ఒకొక్క అంశంపై చర్చలను ఒక కొలిక్కి తెచ్చిందని సమాచారం. ప్రధానంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగే పదేళ్ల కాలంలో శాంతి భద్రతలు, విభజన తర్వాత ఆస్తులు, నీటి వనరుల పంపకం, పోలీసు సిబ్బంది తదితర అంశాలపై తుది చర్చలు జరిపినట్లు తెలిసింది. రాజ్యాంగ పరిధిలోనే ఉమ్మడి రాజధానికి అవకాశం ఉందని దిగ్విజయ్ సింగ్ కూడా స్పష్టం చేశారు. అలాగే యూటికి అవకాశం లేదని, రాయల తెలంగాణను కూడా పక్కన పెట్టారని సమాచారం. భద్రాచలం విషయంలో కూడా యథాతథ స్థితిని కొనసాగించనున్నారు. విభజన అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయాలకు అనుగుణంగా వివిధ శాఖల కార్యదర్శులు సమాచారాన్ని అందించారని, పవర్ పాయింట్ ప్రజెం ద్వారా వివరించారని తెలిసింది. ¬ంశాఖ భద్రతా సలహాదారుడు విజయ్‌కుమార్ కూడా తన నివేదికను సమర్పించగా దానిపైనా చర్చించారు నూతనంగా ఏర్పాటు కానున్న సీమాంధ్ర రాష్టాన్రికి కేంద్రం భారీ ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని జీవోఎం సిఫారసు చేయనున్నట్లు తెలుస్తున్నది. హైదరాబాద్‌కు దీటుగా కొత్త రాజధానిని అభివృద్ధి చేసుకునేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ దాని నిర్మాణానికి నిధులను కేంద్రమే అందించేలా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు అందించేలా సిఫారసులు ఉన్నాయని తెలుస్తున్నది. ఆర్టికల్ 371 డీని ఉభయ రాష్టాల్లో కొనసాగించాలని జీవోఎం తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ద్వారా జిఓఎం కీలకసమాచారాన్ని తెప్పించుకుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, పరిపాలనా వ్యవహారాలు, శాంతి భద్రతలు, సరిహద్దులు, ఉద్యోగులు తదితర అంశాలపై జీవోఎం కోరిన వివరాలను మహంతి అందజేసినట్లు తెలుస్తున్నది. నివేదిక తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్.. సీడబ్ల్యూసీ తీర్మానానికి అనుగుణంగా ముసాయిదా బిల్లు తయారు చేసేందుకు నివేదికను తయారు చేస్తున్నారు. వివిధ శాఖల కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చిన జైరాం 11 అంశాలపై పూర్తి అవగాహనతో కూడిన నివేదికను ఆయన సహచర సభ్యుల సహకారంతో తీర్చిదిద్దారని తెలుస్తున్నది. బిల్లు కబినేట్ తరవాత రాష్ట్రపతి నుంచి బిల్లు రాగానే మూడు రోజుల్లోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, పోలీసు అధికారులతో ఆయన చర్చలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తానిచ్చిన మాట మేరకు సకాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల అయ్యేలా రాష్ట్రపతితోనూ చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. 4న బిల్లు ఆమోదించాక 5నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో బిల్లుకు తుది రూపం ఇచ్చే అవకాశం ఉంది. భద్రాచలం, హైదరాబాద్ సమస్యలే కాదని షిండే అన్నారు అయితే ఏ చిన్న సమస్య కూడా రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో చిన్న చిన్న సమస్యలున్నా, అధిగమిస్తామని కేంద్ర ¬ంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. హైదరాబాద్, భద్రాలం పెద్ద సమస్యేలవిూ కానద్నారు. విభజన సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామన్న కేంద్ర ¬ంమంత్రి.. చివరి క్షణం వరకు మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణ నివేదిక ఇంకా తయారవుతూనే ఉందని గురువారం నడు జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణపై చర్చ ఉండదని ఆయన వెల్లడించారు. హైదరాబాద్, భద్రాచలం అసలు సమస్యే కాదన్న ఆయన నిజమైన సమస్యలేంటో తాను ఇప్పుడు చెప్పలేనన్నారు.