జయలలిత
చెన్నై: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు, పుదుచ్చేరిల్లో నలభై లోక్‌సభ స్ధానాలు గెలిచి ఎంజీ రామచంద్రన్ కీర్తి పతాక ఎగరేయాలని తమిళనాదడు ముఖ్యమంత్రి, ఏఐఎడీఎంకే అధినేత జయలలిత పార్టీ శ్రేణలకు పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపకులు ఎంజీఆర్ జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆమె లేఖ రాశారు. దేశ భవిష్యత్తులో తమ పార్టీ కీలకపాత్ర పోషించాలని ఈ లేఖ రాశారు.




