Tuesday, 3 November 2026

తెలంగాణ బిల్లుపై ఓటింగ్‌ ఉండదు

మెదక్‌ : తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్‌ ఉండదని, అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు తెలిపారు. సవరణలపై ఓటింగ్‌ పెట్టాలనే హక్కు ఎవరికీ లేదని చెప్పారు.శాసనసభలో బిల్లు చర్చను అడ్డుకొని ఇప్పుడు 10 రోజుల సమయం కోరడం సమంజసం కాదన్నారు. భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం చేస్తే ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. డీసీపీ తెలంగాణ, సీమంధ్రను వేర్వేరుగా చూస్తున్నారని హరీష్‌ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *