పాతికేళ్ల కల సాకారం
శ్రీహరికోట, జనవరి 5 (జనంసాక్షి) : సమాచార ఉపగ్రహం జీశాట్-14ను జీఎస్‌ఎల్వీ-డీ5 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం 4:18 గంటలకు నెల్లూరు జాల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం(ఇస్రో) నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. 16 నిమిషాల 50సెకెన్లలో రాకెట్ కక్ష్యను చేరుకోవడంతో మునిగిపోయారు. మొత్తం ప్రయోగ వ్యయం రూ.220 కోట్లు కాగా 1982 కిలోల బరువున్న జీశాట్ ఉపగ్రహానికి రూ.45 కోట్లు, దీనిని తీసుకెళ్లిన వాహకనౌక జీఎస్‌ఎల్వీ -డీ5 రాకెట్ తయారీకి రూ.160 కోట్లు ఖర్చయింది. ఈ ఉపగ్రహం కాలపరిమితి 12 సంవత్సరాలని తెలుస్తోం ది. ఇస్రో చరిత్రలో ఇది 105వ ప్రయోగం కాగా, ఇప్పటివరకూ ప్రయోగించిన ఏడు జీఎస్‌ఎల్వీ రాకెట్లకు గానూ మూడు మాత్రమే విజయవంతమయ్యాయి. 2010లో రెండు ప్రయోగాలు విఫలమయ్యా యి.కిందటేడాది ఆగస్టు 19 తేదీనే జీఎస్‌ఎల్వీ -డీ5 నింగిలోకి ఎగరాల్సి ఉండ గా ప్రయోగానికి సరిగ్గా రెండు గంటల ముందు ఇంధనం లీకయి ప్రయోగం వాయిదా పడింది. ఈ రాకెట్‌లోని మొదటి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనాలను ఉపయోగింస్తున్నారు. మూడో దశలో ద్రవరూపంలో హైడ్రోజన్, ఆక్సిజన్‌లను వినియోగించుకునే క్రయోజని క్ ఇంజన్ రంగంలోకి దిగుతుంది. తాజా ప్రయోగం విజయవంతం కావడం తో ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలను అభినందించారు. జీశాట్-3తో పోలిస్తే ఇప్పుడు ప్రయోగించిన జీశాట్-4 ఉపగ్రహం మరింత మెరుగైన బ్రాడ్ కాస్టింగ్ సేవలను అందిస్తుంది. పరిశోధనల నిమిత్తం ఈ ఉపగ్రహం రెండు కేఏ బ్యాండ్ బీకాన్లను కూడా తీసుకెళ్తోంది. కేఏ బ్యాండ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థపై వాతావరణ ప్రభావం గురించి పరిశోధనలను కూడా ఇది నిర్వహించనుంది. ఈ ఉపగ్రహం కోసం 2,600 వాట్ల సౌరశక్తిని అందించే వ్యవస్థలను సమకూర్చాయి.




