హైదరాబాద్: వేతన సవరణను డియాండ్ చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ల ఫ్లోరం ఆధ్వర్యంలో రేపటి నుంచి వాళ్లు రెండు రోజులపాటు సమ్మె కొనసాగించనున్నారు. దీంతో బ్యాంకింగ్ రంగ కార్యకాలపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఫిబ్రవరి 6న కార్మికశాఖ ప్రధాన కమిషనర్‌లో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో రేపటి నుంచి సమ్మె చేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రైవేట్ బ్యాంకులు మామూలుగా పనిచేయనున్నాయి.




