కరీంనగర్,ఆగస్ట్1: శాస్త్ర, సాంకేతిక విషయాలపై విద్యార్థుల్లోని ఆసక్తి, ప్రతిభను వెలికితీసేందుకు జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ అవార్డు వ్‌చ్ఞైజనిక ప్రదర్శనలను ఏర్పాటు చేశామని డిఇవో తెలిపారు. ఇందులో తమ ప్రతిభను చాటుకునే అవకాశం విద్యార్థులకు కలుగుతుందన్నారు. ఈ నెల 5 నుంచి డివిజన్‌ల వారీగా ప్రదర్శనలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాధికారి తెలిపారు. గత విద్యాసంవత్సరంలో అవార్డులు పొందిన జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులు వీటిల్లో పాల్గొనాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో పరిశోధనతో కూడిన ప్రాజెక్టుల నమూనాలను తయారు చేయించి ప్రదర్శించాలని తెలిపారు. ఇందుకు వారిని ప్రోల్సహించాలన్నారు. గతంలో ఇన్‌స్పైర్ అవార్డులను పొంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రదర్శనల్లో పాల్గొనని విద్యార్థులు ఇప్పుడు జరగబోయే ప్రదర్శనలో తప్పకుండా పాల్గొనాలని అన్నారు. హుజూరాబాద్ డివిజన్ ప్రదర్శనలను ఆగస్టు 5 నుంచి 7 వరకు అక్కడికి సవిూపంలోని తుమ్మనపల్లిలోని మాతృశ్రీ ఉన్నత పాఠశాలలో, కరీంనగర్, సిరిసిల్ల డివిజన్‌ల ప్రదర్శనలను 6 నుంచి 8 వరకు కరీంనగర్ సవిూపంలోని కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఉన్నత పాఠశాలలో, పెద్దపల్లి డివిజన్ ప్రదర్శనలను 11 నుంచి 13 వరకు అక్కడి ట్రినిటి ఉన్నత పాఠశాలలో, జగిత్యాల డివిజన్ ప్రదర్శనలను 17 నుంచి 19 వరకు ధరూర్‌లోని మౌంట్ కార్మిల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటిలో ఆయా ప్రాంతాల విద్యార్థులు పాల్గొని నైణ్యాలకు పదను పెట్టాలన్నారు.




