కరీంనగర్,ఆగస్ట్1: ఒక్కరోజు తేడాతో జిల్లాకు సిఎంతో పాటుహోంమంత్రి కూడా రానున్నారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ,¬మంత్ని నాయిని నర్సింహారెడ్డిలు వస్తున్నారు. ఈనెల 4 లేదా 5 తేదీల్లో కరీంనగర్‌కు సిఎం రానున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందిందన్నారు. రూ.46 కోట్లతో నగర పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల పనులకు శంకుస్థాపన, లక్ష మొక్కల నాటే కార్యక్రమ ప్రారంభం, రోజూ నీటి సరఫరా పనుల పైలాన్ ప్రారంభిస్తారని వివరించారు. ఈ సందర్భంగా కరీంనగర్ సిటీ రెన్యూవేషన్ కమిటీ ఆవిర్భావం జరగనుందని చెప్పారు. అలాగే జెడ్పీ, నగరపాలక సంస్థల్లో జరిగే సమావేశాల్లో సీఎం పాల్గొంటారని తెలిపారు. ఈసందర్భంగా నగరపాలక సంస్థకు రూ.400కోట్లు, నాన్‌ప్లాన్ గ్రాంటు కింద మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు చెప్పారు. జిల్లా నుంచే సీఎం అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు.బకోవైపు ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ నెల 3న గోదావరిఖనికి రానున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.ఉపేందర్ తెలిపారు. . ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఎన్టీపీసీ టీటీఎస్‌లోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఉద్యోగ సంఘాలు, ఒప్పంద కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా ¬ంమంత్రి సమావేశం కానున్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కార్మిక, ఉద్యోగుల సమస్యలను వివరిస్తారని పేర్కొన్నారు.
జిల్లాలో సిఎం కెసిఆర్, హోంమంత్రి నాయినిల పర్యటన






