Monday, 2 November 2026

మూడో లేడీ కలెక్టర్‌గా ప్రియదర్శిని

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌1: పాలమూరు జిల్లాకు మరోమారు లేడీ కలెక్టర్‌గా ప్రియదర్శిని బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉషారాణి, దమయంతిలు కలెక్టర్లుగా పనిచేసి మంచి పేరు సంపాదించు కున్నారు. ప్రస్తుతం మరోమారు లేడీ బాస్‌ రావడంతో ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధిని ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.  మూడో మహిళా కలెక్టర్‌గా ప్రియదర్శిని రాగా, పాలమూరు జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా వి.ఉషారాణి 19.05.2006 నుంచి 13.02.2009 వరకు పనిచేశారు. అనంతరం దమయంతి 14.02.2009 నుంచి 08.04.2010వరకు విధులు నిర్వర్తించారు.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా ప్రియదర్శిని నిలువనున్నారు.  24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్దికి రాజీలేని విధంగా కృషి చేస్తానన్నారు. కొత్త ప్రభుత్వం ప్రణాళికలకు అనుగుణంగానే ప్రగతి అని అన్నారు.  జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేస్తాను అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనేవిస్తీర్ణంలో పెద్ద జిల్లా అయిన పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నడిపిచేందుకు అహర్నిశలు కష్టపడతానని చెప్పారు.  జిల్లా సమస్యలపై ప్రత్యేక అధ్యయనం చేసి  వాటి పరిష్కారానికి వేగవంతమైన చర్యలు చేపడతామనని కలెక్టర్‌ ప్రియదర్శిని తెలిపారు. జిల్లా పరి/-థసితులు గుర్తించాక వాటి ద్వారా జీవనోపాధుల పెంపు, నిరుద్యోగ సమస్య నిర్మూలన, ఉపాధి అవకాశాలు విద్య, వైద్యం తదితర అంశాలపై సమగ్రమైన చర్యలు చేపడతానని పేర్కొన్నారు.  గ్రేటర్‌ హైదరాబాదు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌గా , మున్సిపల్‌ కార్పొరేషన్‌ అదనపు డిప్యూటీ సెక్రటరీగా , రూరల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రియదర్శిని ఇప్పుడు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా ఇవే ఆమెకు తొలి బాధ్యతలు కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *