Tuesday, 3 November 2026

6 నుంచి 9 సిలిండర్లు ఇచ్చేందుకు కేంద్రం సమ్మతి: పనబాక

గుంటూరు: గ్యాస్‌ వినియోగదారులకు వూరట కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం దీపావళి పండగ రోజున వెల్లడించే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. సబ్సిడీపై ఏడాదికి 6 నుంచి 9 వంట గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు కేంద్రం సమ్మితించినట్లు మంత్రి గుంటూరులో చెప్పారు. ఈ నిర్ణయాన్ని దీపావళి రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలియజేశారు. వినియోగదారుల ఇబ్బందుల పరిష్కారానికి బాపట్లలో గ్యాస్‌ అదాలత్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *