డే
టా విండ్ పెట్టుబడులతో ముఖ్యంగా యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడుతాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డేటా విండ్ మొబైల్, ట్యాబ్‌లెట్ తయారీ పరిశ్రమను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో మంత్రితోపాటు కెనడా రాయబారి నాదిర్‌పటేల్, సీఈవో సునీత్ సింగ్‌తులితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ డేటా విండ్ పెట్టు బడుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చ డమే కాకుండా ఉద్యోగాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మరో వెయ్యి ఉద్యోగాలు కల్పించను న్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోనే టీఎస్ ఐపాస్ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీగా పేరు తెచ్చుకుందన్నారు. ఇప్పటికే 40 కెనడా కంపెనీలు తెలంగాణలో వ్యాపారం చేస్తున్నా యని తెలిపారు. త్వరలో తెలంగాణలో ఇం టింటికి మంచినీటి నల్లాతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తామన్నారు. గేటా విండ్ అగ్రగా మిగా కొనసాగుతుందన్నారు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన డేటా విండ్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లకు ఇంటర్నెట్ సేవలు అందించడంలో డేటావిండ్ అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. డేటా విండ్ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు.
6 నెలల్లో డేటావింగ్




