Monday, 2 November 2026

క్యూకట్టిన సీనియర్ సిటీజన్లు

09sసీనియర్ సిటీజన్లకు పెద్ద ఊరట కల్పిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. నగదు మార్పిడి చేసుకునే అవకాశం ఇవాళ కేవలం వృద్ధులకు మాత్రమే కల్పిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో సీనియర్ సిటీజన్లు పెద్ద ఎత్తున బ్యాంకులకు క్యూకట్టారు. హైదరాబాద్ మోతీనగర్‌లోని ఎస్‌బీఐ దగ్గర నగదు మార్పిడి కోసం సీనియర్ సిటీజన్లు తరలివచ్చారు. అయితే సీనియర్ సిటీజన్లతో పాటు బ్యాంకు ఖాతాదారులకు సైతం సేవలను అందిచనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఇదే పెద్ద సమస్యగా మారింది. సీనియర్ సిటీజన్లతో పాటు ఆయా బ్యాంకులకు చెందిన ఖాతాదారులు కూడా తరలిరావడంతో పెద్దఎత్తున క్యూలైన్లు ఉన్నాయి. సీనియర్ సిటీజన్లను ముందుగా పంపించే అవకాశం మాత్రం కన్పించడం లేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *