హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమీషనర్ రమాకాంత్‌రెడ్డి విడుదల చేశారు. ఏప్రిల్ 6న జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేదశలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి నామినేషన్ల స్వీకరణ, 20న నామినేషన్ల స్వీకరణకు చివరితేది, 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 24, ఏప్రిల్6న ఎన్నికల పోలింగ్, ఏప్రిల్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.




