బుద్ధగయ: బుద్ధగయలోని మహాబోధి అలయంలో జరిగిన పేలుళ్ల ప్రాంతాన్ని భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్, అపార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, రవిశంరక్ ప్రసాద్, తదితరులు సందర్శించారు. అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. దేశ భద్రత అంశాన్ని ఓటు బ్యాంక్‌తో ముడిపెట్టొద్దని హితవు పలికారు.




