గయ: బుద్ధగయలో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురిని అనుమానిస్తున్నట్లు బీహార్ పోలీసులు వెల్లడించారు. సీసీ కెమెరా పుటేజీల అధారంగా ఒక మహిళ సహా అరుగురు వ్యక్తులను అనుమానితులుగా భావిస్తున్నట్లు చెప్పారు. అరుగురిలో ముగ్గురు వ్యక్తులు అనధికారిక ప్రాంతాల ద్వారా గుడిలోపలికి వచ్చారని, ఇద్దరు వ్యక్తులు వారు వచ్చిన కారు దగ్గర వేచి ఉన్నారని, మరో పొడుగాటి వ్యక్తి ఒక బ్యాగుతో అలయంలోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరా రికార్డుల్లో నమోదైందని పోలీసు అధికారి తెలిపారు. దేవాలయంలో అమర్చిన 16సీసీ కెమెరాలు నాణ్యమైనవి కానందున అనుమానితులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తక్కువ నాణ్యత గల ఈ పుటేజీల్లో ఉదయం 4.10 సమయంలో బోధి వృక్షం వద్ద అనుమానంగా తచ్చాడుతున్న వ్యక్తి ముఖం గుర్తించలేకపోతున్నామన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ,బీహార్ పోలీసులు సీసీటీవీ పుటేజీల ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.




