Tuesday, 3 November 2026

సినీదర్శకుడు కోదండరామిరెడ్డికి మాతృవియోగం

ఇందుకూరుపేట: ప్రముఖ సినీ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తల్లి రమణమ్మ (82) శుక్రవారం ఉదయం మృతి చెందారు. కోదండరామిరెడ్డి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శుక్రవారం ఉదయం అమె అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం జరిగే ఈమె అంత్యక్రియల్లో కోదండరామిరెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *