Wednesday, 4 November 2026

విశాఖలో న్యాయవాదుల నిరసన

విశాఖ: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ విశాఖలో న్యాయవాదులు నిరసన చేపట్టారు. బిర్లా కూడలిలో న్యాయవాదుల ఐకాస ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే కేంద్రం నుంచి నిధులు అధికంగా వస్తాయని, వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని న్యాయవాదుల ఐకాస సమన్వయకర్త మురళీ కృష్ణ ఈ సందర్భంగా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *