Tuesday, 3 November 2026

గర్భిణులకు ఉచిత వైద్య సహాయం అందిస్తారన్న ఆజాద్‌

జైపూర్‌: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా గర్భిణులకు ఉచిత వైద్య సదుపాయం, సమయానికి ఆస్పత్రికి చేరుకోవడానికి అంబులెన్సు సౌలభ్యం కల్పించనుందని కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్‌ ప్రకటించారు. జననీ సురక్ష పథకం కింద గర్భిణులకు, బాలింతలకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గర్భిణిగా నమోదు చేసుకున్నప్పటి నుంచీ కాన్పు జరిగి బిడ్డకు 45 రోజుల వయసు వచ్చేవరకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా వైద్య సహాయం అందిస్తారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *