హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరింది. జంటనగరాల్లో పలు ప్రాంతాల నుంచి భారీగా నీరు హుస్సేన్ సాగర్‌లో కలుస్తుండడటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మరింత నీరు సాగర్ కలిస్తే తమ కాలనీలు నీట మునుగుతాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు. సాగర్ కింది భాగంలో ఉన్న అరుంధతి నగర్, రత్నానగర్, దత్తానరగ్, దోమల్‌గూడ, హిమాయత్‌నగర్, అశోక్‌నగర్ తదితరకాలనీల ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.




