న్యూఢిల్లీ: అస్థిరమైన విదేశీ మారక విపణి ఆందోళన కలిగిస్తోందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. బంగారం, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి తగ్గించిల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు దీర్ఘకాలిక రుణాల వడ్డీరేట్ల పెంపుదలకు సంకేతం కాదన్నారు. కరెంటు ఖాతా లోటు నియంత్రణకు అన్ని విధానపరమైన చర్యలు తీసుకున్నామని, దీంతో కరెంటు ఖాతా లోటు నియంత్రించగలిగామని పేర్కోన్నారు. వచ్చే ఏడాదికి కరెంటు ఖాతా లోటు మరింత తగ్గుతుందన్నారు. దేశ ఆర్థిక మూలాలు దృఢంగా ఉన్నాయన్నారు.




