శ్రీనగర్: కాశ్మీర్ లోయలోని ప్రముఖ పట్టణాలలో విధించిన కర్ఫ్యూ కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గురువారం రాంబాన్‌లో సరిహద్దు రక్షణ దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులు మరణించారు. ఇందుకు నిరసనగా కాశ్మీర్‌లో వేర్పాటు వాదులు ఈ రోజు నుంచి మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ కొనసాగుతున్న నేపధ్యంలో అమర్‌నాధ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే వివిద ప్రాంతాల నుంచి వచ్చిన 1000మంది యాత్రికులు జమ్మూ చేరుకున్నారు. వారు అక్కడే బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు.




