కాగజ్‌నగర్ : ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని జెజ్జూరు. కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బెజ్జూర్-పెంచికల పేట ప్రధాన రహదారిలోని తీగలమర్రి వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సుడ్రైవర్, కండర్టర్ బస్సుఎక్కి రక్షంచాలని కోరుతున్నారు. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వరద ఉద్దృతి మరింత ఎక్కువైతే బస్సు కొట్టుకుపోయే ప్రమాదముంది. ఆదిలాబాద్‌సరిహద్దు గుండా ప్రవహిస్తున్న పెన్‌గంగా, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల సమీపంలో వరద నీరు చేరుతుంది. సిర్పూర్‌టి-కౌటాల ప్రధాన రహదారిలోని తాటిచెట్టువర్రె వంతెన పై నుంచివరద నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలు నిలిచిపోయాయి.




