Tuesday, 3 November 2026

గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది

భద్రాచలం:గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు ఉదయం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 51.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. నీటి మట్టం 53 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం వుంది. కాళేశ్వరంలో 189.4, ఇంద్రావతి వద్ద 172., తేరూరు వద్ద 581మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కావడం ఇంకా వరద వచ్చే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గోదావరి తీర ప్రాంతాల్లో దాదాపు వంద గ్రామాల్లో రాకపోకలు స్తంబించాయి. ముందస్తు చర్యలు చేపట్టడంతో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. భద్రచలం పట్టణంలో కొత్త కాలనీలో వరద నీరు వచ్చి చేరింది. రామాలయానికి సంబందించిన నిత్యాన్నదాన సత్రంలోకి వరదనీరు చేరడంతో భక్తులు అవస్ధలు పడుతున్నారు. ముందునుంచే మోటర్లు ఏర్పాటుచేసి నీటిని తోలగించాల్సిన యంత్రాంగం సకాలంలో స్పందించాక పోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని స్ధానికులు వాపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *