Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్టీసీ ఎండీఏకే ఖాన్‌ అన్నారు. వ్యాధులు బారిన పడి మృతి చెందిన వారి కంటే ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య అధికంగా ఉంటోందన్నారు. రోడ్డు భద్రత అనే అంశం ప్రధానమైనదని, అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో కలిసి పని చేస్తే ప్రమాదాల సంఖ్య తగ్గించవచ్చు అభిప్రాయపడ్డారు. ఖైరతాబాద్‌ లోని ఇనిస్ట్యుట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, ధర్డ్‌ రాక్‌ కన్సల్టుంట్స్‌ సంస్ధ సంయుక్తంగా రోడ్డు భద్రతపై నిర్వహించిన సదస్సును ఖాన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అమిత్‌ గార్గ్‌, ఇనిస్టిట్యూట్‌ ఇంజినీర్స్‌ కార్యదర్శి కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *