హైదరాబాద్: ‘సాగదీస్తే.. సాగనంపుతాం’ నినాదంతో తెలంగాన రాజకీయ ఐకాస శుక్రవారం జనచైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ నెల 24 వరకు తెలంగాన జిల్లాల్లో యాత్ర కొనసాగుతుంది. 25న హైదరాబాద్‌లో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు జనచైతన్య చాత్రను రాజకీయ ఐకాస కార్యలయం నుంచి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్, తాండూరులో ఈ యాత్ర సాగనుంది. 2014 ఎన్నికల లోపు తెలంగాణ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రం ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని ఐకాస నేతలు శ్రీనివాస్‌గౌడ్. విఠల్ అన్నారు. యాత్ర ముగిసిన అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు.




