అనంతపురం,(జనంసాక్షి): జిల్లాలోని గోరంట్ల మండలంలోని గంగంపల్లిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణతో ఓ కుటుంబం నిప్పంటించుకుంది. ఈ ఘటనలో భార్యా కుమారుడు మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.




