Tuesday, 3 November 2026

ల్యాప్‌టాప్‌లతో యూపీలో మార్పు తెచ్చి చూపించాం: యూపీ సీఎం

హైదరాబాద్‌: యూపీలో అన్ని సామాజిక వర్గాల సహకారంతో అధికారంలోకి వచ్చి అభివృద్ధి చూపించామని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఆదివారం నాగోల్‌లో జరిగిన అఖిల భారత యాదవ మహసభ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిధి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ సమాజ్‌వాది పార్టీ అంటే వెనకబడిన వర్గాల పార్టీగా ముద్ర ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాకే అనేక సంస్కరణలు చేపట్టామని తద్వారా అభివృద్ది సాధిస్తున్నామని అన్నారు. విద్య,వైద్య,ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము ల్యాప్‌టాప్‌ల పథకాన్ని ప్రవైశపెట్టి విద్యారంగంలో మార్పు తెచ్చి రాష్ట్ర ప్రజలకు చూపించామన్నారు. యాదవులు దేశ వ్యాప్తంగా అన్నీ పార్టీల్లో ఉన్నారని సామాజిక కార్యక్రమాల్లో అందరు పాల్గొంటూ ఐక్యంగా ఉండాలని కోరారు. ఈ ఈ కార్యర్కమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, అఖిలభారద యాదవ మహాసభ అధ్యక్షుడు ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌, యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్‌ సింగ్‌, రాష్ట్ర అధ్యక్షులు బాబురావ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *