Tuesday, 3 November 2026

ముస్లిం సోదరులపై టీడీపీ కార్యకర్తల దాడి

జగ్గయ్యపేట,(జనంసాక్షి): వీరులపాడు మండలం వెల్లంకి గ్రామ పంచాయతీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చిందిన ముస్లిం సోదరులు కైవసం చేసుకున్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలు అక్కసుతో ఆ ముస్లిం సోదరుల ఇళ్లపై సోమవారం రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కాగా వారు బాధితుల నుంచి ఫర్యాదు తీసుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో బాధితులు నందిగామ డీఎస్సీని ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *