Monday, 2 November 2026

సెటిలర్లకు హక్కులను పరిరక్షిస్తాం: టీనేతలు

హైదరాబాద్‌: రాష్ట్రం విడిపోయినంత మాత్రాన తెలంగాణలో సీమాంధ్రులకు వచ్చిన ఇబ్బందులేమి లేవని తెలంగాణ ప్రాంత నేతలు అన్నారు. ఇవాళ వాళ్లు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న సెటిలర్ల హక్కులను తాము రక్షిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజనకు సహకరించాలని, సోదరుల్లా విడిపోయి అన్న దమ్ములా కలిసుందామని వారు సీమాంధ్రనేతలకు విజ్ఞప్తి చేశారు. విభజన జరిగితే రెండు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. అభివృద్దికి, ఐక్యతకు సంకేతంగా నిలుద్దామని తెలంగాణ నేతలు పిలుపునిచ్చారు,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *