శ్రీనగర్: కిష్ట్వా జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుత్నాయి. కిష్ట్వార్ జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉండగా తాజాగా మరో రెండు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. రాజౌరి, జమ్యూ జిల్లాలో శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. కాష్ట్వార్ జిల్లాలో గత రెండు రోజులుగా చోటు చేసుకున్న ఘర్షణల్లో ఇద్దరు మృతి చెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు.




