Tuesday, 3 November 2026

బావిలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

కరీంనగర్‌: జిల్లాలోని మానుకొండూరు మండలం గంగిపెల్లి గ్రామంలో ఈ ఉదయం వ్యవసాయబావిలోకి స్కూలు బస్సు దూసుకెళ్లింది. అయితే బస్సులో విద్యార్థులు లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామం నుంచి విద్యార్ధులను పాఠశాలకు తీసుకురావడానికి గ్రామానికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *