Thursday, 5 November 2026

మణిపూర్‌ను మరోసారి విభజించే ప్రశ్నే లేదు: సీఎం

ఇంఫాల్‌: మణిపూర్‌ను మరోసారి విభజించే ప్రశ్న లేదని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఒక్రమ్‌ ఇబోబి తేల్చి చెప్పారు. అన్ని తెగల వారూ ఆందోళన పధం వీడి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఆయన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో పేర్కోన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు కోరితే తాను, తన మంత్రుల బృదదమూ ఏ క్షణానైనా రాజీనామా చేయడానికి సిద్దం అన్నారు. స్వతంత్ర భారత దేశంలో మణిపూర్‌ ఒక రాష్ట్రం అని ఇంకా స్వాతంత్రం కోసం ఆయుధాలు పట్టాల్సిన పనిలేదని, హింసాత్మక మార్గం వదిలి పెట్టాలని ఆయన ఆందోళన కారులకు సూచించారు. మణిపూర్‌లో గత కొద్ది రోజులుగా పలు చోట్ల బాంబు పేలళ్లు సంభవిస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇంటి వద్ద కార్యాలయం వద్ద సైతం బాంబులు పేలాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *