హైదరాబాద్: కస్టమ్స్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి పరారైన సంగతి వెలుగులోకి వచ్చింది. భాస్కర్ భార్గవ్ అనే వ్యక్తి తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పి పలువురిని మోపం చేశాడని 15 మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడని దాదాపు రెండు కోట్ల రూపాయలు దోచుకుని పరారయ్యాడని శంషాబాద్ పోలీసు స్టేషన్లో బాధితులు ఫిర్యాలు చేశారు.




