వనపర్తి: వనపర్తి పట్టణంలోని సి.వి.రామన్ పాఠశాలలో పని చేసే పీఈటీ కృష్ణనాయక్(25), పదోతరగతి విద్యార్థి శరత్‌చంద్ర(16) ఈ రోజు సాయంత్రం విద్యుదాఘాతంతో మృతి చెందారు. పాఠశాలలో ఉదయం ఎగురవేసిన జాతీయ జెండాను పైనుంచి కిందకు దించుతుండగా పాఠశాల ప్రక్కనే ఉన్న హైటెక్షన్ విద్యుత్ తీగలకు జెండా కర్ర తగిలి విద్యుత్ షాక్‌కు గురి అయ్యి అక్కడికక్కడే మృతి చెందారు. దాంతో పలు విద్యార్థిసంఘాల నాయకులు వచ్చి పాఠశాల ఎదుట బైటాయించారు.




