హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలోని శారదానగర్ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయం ఎదుట కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న మఠికంఠ ఇంట్లో చొరబడిన దొంగలు నలుగురుని హత్య చేశారు. దుండగుల దాడిలో గాయ పడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.




