Tuesday, 3 November 2026

గాందీ ఆసుపత్రి దారుణం

హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. శిశువును ఓ మహిళ ఎత్తుకుని పరారైంది. కడపకు చెందిన సుమిత్ర, మనోహర్‌ దంపతులు గతేడాది నుంచి బోరబండ శ్రీరాంనగర్‌లో నివసాముంటున్నారు. సుమిత్రను ప్రసవం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా, నిన్న మధ్యాహ్నం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలో డెలివరీ రూంలో ఉన్న ఓ మహిళ తన పేరు మరియమ్మ అని పరిచయం చేసుకుంది. వారికి సేవలు సేస్తున్నట్లు నటిస్తూ ఈ రోజు తెల్లవారుజామున శిశువును ఎత్తుకుని పరారైంది. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *