Tuesday, 3 November 2026

వీహెచ్‌పీ యాత్రకు అనుమతి నిరాకరించిన అఖిలేష్‌

ఉత్తరప్రదేశ్‌,(జనంసాక్షి): అయోద్యలో విశ్వహిందూ పరిషత్‌ తలపెట్టిన యాత్రకు అఖిలేష్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయోద్యలో రామ మందిర నిర్మాణం డిమాండును తిరిగి ప్రజలలోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ఈ నెల 25 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు వీహెచ్‌పీ ఈ యాత్ర తలపెట్టింది. యాత్రకు అనమతించడమంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అవుతుందని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆర్‌ ఎం శ్రీవాత్సవ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *