ఉత్తర ప్రదేశ్: నేటి నుంచి సెప్టెంబరు 13 వరకు ‘కోసి పరాక్రమ యాత్ర’ నిర్వహించాలని వీహెచ్‌పీ నిర్ణయించింది. వీహెచ్‌పీ యాత్ర దృష్ట్యా ఫైజాబాద్, అయోధ్య జిల్లాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ముందు జాగ్రత చర్యగా వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియాను అయోధ్యలో గోలాఘాట్‌లో అయోధ్యలో మహంత్ గోపాల్‌దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని దాదాపు 350 మంది వీహెచ్‌పీ కార్య కర్తలను అరెస్టు చేశారు. వీహెచ్‌పీ యాత్ర నేపధ్యంలో 6 జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.




