హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ట్రాఫిక్ పోలీసులు భారీ వడ్డనలే కాదు భౌతిక దాడులు చేయడం లోనూ సత్తా చేపుతున్నారు. దుకాణం ఎదుట వినియోగదారులు వాహనాలు నిలిపిన పాపానికి దుకాణదారుపై ఓ ట్రాఫిక్ ఎస్సై దురుసుగా వ్యవహరించాడు. నోటీసులో రాసేందుకు తండ్రి పేరుకు స్పెలింగ్ తెలియదన్నందుకు చలాన్లు రాసే పెన్నుతో దుకాణదారుని కంటికింద పొడిచి వీరంగం సృష్టించాడు. ఈ ఉదాంతం సైబరాబాద్ కమిషనరేట్ లోని మాదాపూర్ ఠాణాపరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. కొత్తగూడకు చెందిన బి.రాకేష్ పటేల్ (35) స్థానికంగా శ్రీబాలాజీ స్వీట్‌హౌస్ నిర్వహిస్తున్నాడు. సమీపంలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగ దారుల షాపు బయట వాహనాలు నిలిపారు. శనివారం సాయంత్రం కానిస్టేబుల్‌తో కలిసి అక్కడికొచ్చిన మాదాపూర్ ట్రాఫిక్ ఎస్సై బాలునాయక్ నో పార్కింగ్‌లో వాహనాల నిలపడంపై మండిపడ్డారు.
నోటీసులో రాసేందుకు తండ్రిపేరు అడగ్గా షాపు యజమాని బవర్‌లాల్ అని చెప్పారు. ఆంగ్లంలో స్పెలింగ్ అడగడంతో తనకు చదువు రాదని చెప్పారు. దీంతో విచక్షణ కోల్పోయిన బాలునాయక్ పెన్నుతో రాకేష్ ఎడమకంటిలో పోడిచాడు.




