Wednesday, 4 November 2026

టోల్‌ ప్లాజా ఘటన : ఎమ్మెల్యే రాజీనామా

నాసిక్‌: అందరూ మహిళ సిబ్బంది ఉన్న ఒక టోల్‌ ప్లాజా వద్ద ఎమ్మెల్యేని టోల్‌ రుసుము కట్టమంటారా అంటూ అనుచరులతో రభస చేయించిన మహారాష్ట్ర శాసన సభ్యుడు రాజీనామా చేయక తప్పలేదు. అనిల్‌ కదమ్‌ అనే ఈ శివపేన ఎమ్మెల్యే కారులో వెళ్తుండగా ఓ టోల్‌ ప్లాజా దగ్గర సిబ్బంది ఆయన కారు ఆపి రూ.40 రుసుము కట్టమన్నారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మహిళా సిబ్బందిని దుర్భాషలాడడమే కాక మీ దుస్తులు విప్పిస్తానంటూ నోటికిచ్చినట్లు మాట్లాడారు. టోల్‌ ప్లాజాను ధ్వంసం చేయమంటూ అనుచరులకు పిలుపునిచ్చారు. వాళ్లు టోల్‌ ప్లాజాను ధ్వంసం చేయమంటూ అనుచరులకు పిలుపునిచ్చారు. వాళ్లు టోల్‌ బూత్‌పై తమ ప్రతాపం చూపి అక్కడి కంప్యూటర్‌ తదితరాలను పాడు చేశారు. సాధారణంగా ఎమ్మెల్యేల కార్లకు టోల్‌ కట్టక్కరలేదు. కానీ ఈయన తన కారులో కాక ప్రైవేటు కారులో ప్రయాణిస్తు తన కారు నంబరు రాసుకోమని సిబ్బందికి చెప్పారు. అది కుదరదని సిబ్బంది రుసుము కట్టమన్నారు. ఒక ప్రజా ప్రతినిధిగా నిజాయతీగా వ్యవహరిస్తున్న సిబ్బందిని మెచ్చుకోవాల్సింది పోయి 40రూపాయల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడడంతో అవికాస్తా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే నిజరూపం పత్రికల కెక్కడంతో రాజీనామా బాట పట్టక తప్పలేదాయనకు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *