ఢిల్లీ: రజీయా తిరియా 23 ఏళ్ల యువకుడు. ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి అనాధగా మారినా నేడు ఐఐఎం రోహ్‌తక్‌లో చేరాడంటే దాని వెనుక తన కన్నా స్నేహితుల ప్రోత్సాహమే ఎక్కువని అతను మనస్పూర్తిగా చెబుతాడు. తనచుట్టూ అంతా మంచివారే ఉండడం తన అదృష్టమన్నాడు. రజీబా పల్లెటూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఏడేళ్ల వయసులో తండ్రి మరణించాడు. ఇక చదువు మానేయక తప్పని పరిస్థితి. కానీ తల్లి నేనున్నా చదువుకోమంది. తాను రోజు కూలీకెళ్లి కొడుకుని చదివించింది. కానీ దురదృష్టం అతన్ని వదలలేదు. డిగ్రీ పూర్తయ్యేలోపే సరైనా వైద్య సౌకర్యం అందక తల్లీ మరణించింది. అనాధ అయిన అతడు సెల్ ఫోన్ రిపేర్ల కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. అతని తేలివితేటలు, చదువు పట్ల ఆసక్తి గమనించిన స్నేహితులు క్యాట్ పరీక్ష రాయమని ప్రోత్సహించారు. రష్టపడి చదివి క్యాట్ ఉత్తీర్ణుడయ్యాడు. ఏకంగా ఆరు ఐఐఎంల నుంచి ప్రవేశానిక పిలుపు వచ్చింది. కానీ ఫీజు కట్టెదెవరు? అతని స్నేహితులే ముందుకు వచ్చారు. తమ పొలాలను తాకట్టు పేట్టి డబ్బు సమకూర్చారు. రజీబా రోహ్‌తక్‌లోని ఐఐఎంలో చేరాడు. మంచి ఉద్యోగం సంపాదించడమే కాదు, ఆ తర్వాత తన వంతుగా సమాజానికి ఏం చేయాలో కూడా రజీబా ఇప్పటికే పక్కా ప్రణాళిక రచించుకున్నాడు. తన స్నేహితులు కొందరు మెడిసన్ చదువుదున్నారని వారితో కలిసి మారుమూలల గ్రామాల్లో విద్య,వైద్య సేవలందించే పథకాలను రూపొందించుకున్నామని రజీబా చెప్పాడు.




