Wednesday, 4 November 2026

ఐటీ ఉద్యోగుల ఐకాస ఏర్పాటు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నానాటికీ పడిపోతున్న ఐటీ రంగానికి పూర్వ వైభవం కల్పించేందుకు హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఐకాస ఏర్పాటైంది. హైటెక్‌ సిటీలో ఐటీ ఉద్యోగులు ఈ రోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెల కొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఐటీ పెట్టుబడులు పొరుగు రాష్ట్రానికి తరలిపోవడంతో పాటు ఉన్న కంపెనీలు కూడా తీసేసే పరిస్థితి నెల కొందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 8 వేల ఉద్యోగాలనుంచి నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాల కల్పన వరకు ఎదిగిన ఐటీ రంగం ఇప్పుడు క్రమేణా డీలా పడి పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్ధితి కోనసాగితే భవిష్యత్‌ తరానికి ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఐటీ రంగం కూరుకుపోయిందని దీనికి అన్ని రాజకీయ పక్షాల నుంచి తోడ్పాటు కావాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అన్ని ఐటీ సంస్థల సీఈవోలతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సమస్య పరిష్కారానికి చర్య తీసుకోవాల్సిందిగా ఆంటోని కమిటీతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలను కలవనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *