హైదరాబాద్: తెలుగు భాషపై ద్వానా శాస్త్రి విశిష్ఠ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో 12గంటల నిర్విరామ ప్రసంగ ధార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుభాష పుట్టు పూర్వోత్తరాలు మొదలుకుని ఆధునిక కవితా రూపాల వరకు ఆయన ఏకధాటిగా ప్రసంగించనున్నారు. వంగూరి ఫౌండెషన్ ఆఫ్ అమెరికా ా, వంశీ విజ్ఞానపీఠం, త్యాగరాయగానసభ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చెపట్టాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రసంగం రాత్రి 8గంటలకు ముగియనుంది.




