Wednesday, 4 November 2026

దేశాన్ని కాంగ్రెస్‌ నుంచి విముక్తి చేయాలి: భాజాపా

హైదరాబాద్‌: దేశాన్ని కాంగ్రెస్‌ నుంచి విముక్తి చేయాలని భాజపా సీనియర్‌నేత వెంకయ్యనాయుడు అన్నారు. భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై భాజపా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. పార్లమెంటులో తన ఉపన్యాసాన్ని అర్థం చేసుకోలేక అపోహలు సృష్టిస్తున్నారన్నారు. తాము పొత్తుల గురించి చర్చించడం లేదని, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని కోరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్స్‌తర పక్షాలన్నీ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని కోరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ద్వంద ప్రమాణాలు కట్టిపెట్టాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *