బాగ్దాద్,(జనంసాక్షి): ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో వరసగా జరిగిన పలు బాంబు పేలుళ్లలో 30 మంది మృతి చెందారు. వందమంది గాయపడ్డారు. ఓ వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ బాంబుదాడుల్లో గత జూలై నెలలో 1057 మంది మృతి చెందారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.




