Tuesday, 3 November 2026

పెంటావాలెంట్‌ వ్యాక్సిన్‌పై సమాధానమివ్వండి

కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పెంటావాలెంట్‌ వ్యాక్సిన్‌ను నిషేధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. హెపటైటిస్‌-బి, డిఫ్తీరియా, తదితర వ్యాధుల నిరోధానికి ఈ వ్యాక్సిన్‌ను వినియోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ వినియోగం వల్ల పిల్లల్లో ఇతరాత్రా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని ఆరోపిస్తు సీనియర్‌ వైద్యుడు యోగేష్‌ జైన్‌ పిటిషన్‌ వేశారు. దీనివల్ల దేశంలో ఇప్పటి వరకు 21 మంది మైనర్లు చనిపోయారని, వ్యాక్సిన్‌ను నిషేధించాలని కోరారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను అమెరికా, జపాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాలు నిషేధించాయని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. పిటిషన్‌ పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పి. సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని కేంద్రాన్ని కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *