న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వూద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు బయలు దేరారు. ఆమెతో పాటు ప్రియాంకగాంధీ కూడా ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్థన్ ద్వావేధి విలేకరులతో మాట్లాడుతూ సోనియాగాంధీ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లినట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన సోనియాగాంధీకి ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.




